విరాళం ఇస్తే, డిన్న‌ర్ డేట్‌కి ఆహ్వానిస్తాడ‌ట‌

క‌రోనా వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో రకం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంద‌రు పాట‌లు పాడుతూ విరాళాలు అడుగుతుంటే, మరి కొంద‌రు పలు ఆఫ‌ర్స్ ఇచ్చి ఫండ్స్ అడుగుతున్నారు. ఏది ఏమైన మంచి పని కోసం కాబ‌ట్టి ఆప‌ద‌లో ఉన్న వారికి చేయూత‌నిచ్చేందుకు చాలా మంది ముందుకు వ‌స్తున్నారు. అయితే తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ అంద‌రికి భిన్నంగా డేటింగ్ తో ఫండ్స్ రెయిజ్ చేస్తాను అంటూ నోరెళ్ల పెట్టేలా చేస్తున్నాడు.


 'గివ్ ఇండియా'.. 'ఫ్యాన్ కైండ్'.. వారి సహకారంతో  వర్చువల్ డేట్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి దానికి వ‌చ్చిన‌ విరాళాల‌ని కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి సాయం అందిస్తానని అంటున్నాను అర్జున్ క‌పూర్.  ఇంతకీ ఫ్యాన్స్ ఏం చెయ్యాలంటే www.fankind.org/Arjun వెబ్ సైట్ లో డొనేషన్ ఇవ్వాలి. ఇలా డొనేషన్ ఇచ్చిన వారిలో ఐదుమంది లక్కీ విన్నర్లను ఎంపిక చేసి ఏప్రిల్ 11 న వర్చువల్ డిన్నర్ డేట్ కు ఆహ్వానిస్తాడట. అంటే ఎవరింట్లో వారు కూర్చుని.. ఏ వీడియో కాలింగ్ ద్వారానో లేక జూమ్ ద్వారానో అర్జున్ తో కబుర్లు చెప్తూ డిన్నర్ చెయ్యవచ్చు.  మొత్తానికి అర్జున్ వేసిన స్కెచ్ అభిమానుల‌ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది. కాగా, అర్జున్ క‌పూర్ ప్ర‌స్తుతం మ‌లైకా అరోరాతో డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే