మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వంతో పాటు నిరుపేదలకి ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సి ఉంది. ఎవరికి తోచినంత వారు కొంత మొత్తాన్ని విరాళంగా అందిస్తే పేదవారి కడుపు నిండుతుంది. ఇప్పటికే ఆకలి మంటతో అలమటిస్తున్న వారికి ఆదుకోవడానికి సినీ, క్రీడా, వాణిజ్య ప్రముఖలు ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ అండగా నిలిచింది.
ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచిన కరోనా క్రైసిస్ ఛారిటీకి చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు బాధ్యతగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా డైలాగ్ కింగ్ సాయికుమార్ ఆయన కుమారుడు హీరో ఆది సాయి కుమార్ కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 5 లక్షల 4 రూపాయలను విరాళంగా అందజేసారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయి కుమార్ తన వంతుగా రూ.1 లక్ష 8 రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. మరోవైపు సాయికుమార్ సోదరుడు బొమ్మాళీ రవిశంకర్ తన వంతుగా రూ. లక్ష రూపాయలను విరాళంగా అందజేసారు. మొత్తంగా సాయి కుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల 12 రూపాయాలను విరాళం అందజేయడం జరిగింది.