స్కెచ్ వేసిన స‌ల్మాన్.. ఫిదా అయిన నెటిజ‌న్స్‌

క‌రోనా కార‌ణంగా షూటింగ్స్‌తో పాటు సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో స్టార్స్ అంద‌రు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఈ ఖాళీ స‌మయాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీతి జింతా త‌న త‌ల్లి త‌ల‌కి ఆయిల్ పెట్టి మ‌సాజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న‌లోని ఆర్ట్స్‌ని బ‌య‌ట‌కి తీస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నాడు. 


స‌ల్మాన్ ఖాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో పేపర్‌పై మహిళ, పురుషుడి స్కెచ్‌ వేస్తున్నట్టు క‌నిపించాడు. ‘ప్రస్తుతం మనం ధరించే విధానం.. భారత సంస్కృతికి గొప్పతనం’ అంటూ వివ‌రించాడు. హృతిక్ రోష‌న్, అమీషా ప‌టేల్ జంట‌గా పాడిన క‌హో న ప్యార్ హై సాంగ్ పాడుకుంటూ స‌ల్మాన్ ఈ స్కెచ్ వేయ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ వీడియో స‌ల్మాన్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.