ఇద్ద‌రు అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల‌కు క‌రోనా

అమెరికాలో ఇద్ద‌రు చ‌ట్ట‌స‌భ‌ప్ర‌తినిధుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. రిప‌బ్లిక‌న్ నేత మారియో డియాజ్ బ‌లార్ట్‌, డెమోక్ర‌టిక్ నేత బెన్ మెక్ ఆడ‌మ్స్‌లు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. సుమారు ప‌ది వేల మందికి వైర‌స్ సోకింది.  ఫ్లోరిడాకు చెందిన మారియో డియాజ్‌.. వైర‌స్ సోకిన తొలి అమెరికా నేత‌గా నిలిచారు.  డియాజ్ జ్వ‌రం, త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. బ‌ధువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు కోవిడ్‌19 సోకిన‌ట్లు తేలింది.  దీంతో వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న త‌న అపార్ట్‌మెంట్‌లో క్వారెంటైన్ అయిన‌ట్లు డియాజ్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు.  గ‌త శ‌నివారం త‌న‌కు స్వ‌ల్ప జ‌లుబు ల‌క్ష‌ణాలు న‌మోదు అయిన‌ట్లు కూడా బెన్ మెక్ ఆడ‌మ్స్ తెలిపారు. తాను కూడా సెల్ఫ్ క్వారెంటైన్ అయిన‌ట్లు ఆడ‌మ్స్ చెప్పారు.