ఒకప్పుడు ఎన్నో అద్భుత చిత్రాలని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ ఇటీవల మహానటి చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించగా, ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. చివరిగా వైజయంతి మూవీస్ బేనర్‌లో దేవదాస్ అనే చిత్రంతో పాటు మహర్షి సినిమాలు రూపొందాయి. తాజాగా ఈ బేనర్ నుండి మరో బిగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది ఏంటనే వివరాలు మరి కొద్ది గంటలలో వెల్లడించనున్నట్టు వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు ఈ సంస్థ గతంలో ప్రకటించింది. ఆ ప్రాజెక్ట్ వివరాలనే వైజయంతి మూవీస్ వెల్లడిస్తుందా అనే అనుమానం సినీ అభిమానులలో కలుగుతుంది.